హుజారాబాద్: ఉప సర్పంచ్ వేధింపులు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా

by Sridhar Babu |   ( Updated:2021-08-15 22:36:33.0  )
హుజారాబాద్: ఉప సర్పంచ్ వేధింపులు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా
X

దిశ, వెబ్‌డెస్క్: హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ సర్పంచ్‌ నేరెళ్ల మహేందర్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ గుజ్జ జయసుధపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె తనను మానసికంగా వేధిస్తున్నదని ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన ఆయన తన గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అప్పు తెచ్చి మరీ తన సొంత డబ్బును ఉపయోగించానని, చెక్కులపై ఉప సర్పంచ్‌ గుజ్జ జయసుధ సంతకం పెడితే నిధులు విడుదల అవుతాయని తెలిపారు.

ఉప సర్పంచ్‌ గుజ్జ జయసుధ అన్నీ తెలిసినా సంతకం చేయకుండా ఇబ్బంది పెడుతుందని, 10 నెలలవుతున్నా చెక్కులపై సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్‌పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అప్పుల వలన తన ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయ్యిందని, ఈ సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే పరిష్కారమని, సోమవారం జరిగే సీఎం కేసీఆర్‌ సభలో ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు డబ్బా చూపిస్తూ మహేందర్‌గౌడ్‌ తెలిపారు.

Advertisement

Next Story