- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైట్ డిశ్చార్జ్‌కు చెక్ పెట్టండిలా..?
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలను పిరియడ్స్ తర్వాత అతిగా వేధించే సమస్య తెల్లబట్ట (వైట్ డిశ్చార్జ్). ఈ వైట్ డిశ్చార్జ్ నెలలో ఒకసారి కొద్దిగా కనిపిస్తే సహజమే కానీ పిరియడ్స్ మాదిరిగా వస్తే మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఈ సమస్య వల్ల శరీరం బలహీనం అవడంతోపాటు ఆకలి కోల్పోతారు. ఒళ్లు నొప్పులతోపాతో కొన్నిసార్లు పొత్తికడుపు నొప్పి వస్తుంది. మత్తుగా ఉంటుంది. ఈ స్రావాలు తెల్లగా కాకుండా గ్రేకలర్, గ్రేయిష్ వైట్, గ్రీన్, ఎల్లో, బ్రౌన్ కలర్‌లో అయితే తప్పనిసరిగా గైనకాలజిస్ట్‌ను సంప్రదించాల్సిందే. వైట్ డిశ్చార్జ్ నివారణకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది ఫీమేల్ రీప్రొడక్టివ్ మీద తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. దాంతో పిల్లలు పుట్టడానికి కష్టం అవుతుంది.
సహజంగా వైట్ డిశ్చార్జ్ సెక్స్ ద్వారా సంక్రమించే డిసీజ్. యోని ఇన్ఫెక్షన్స్, హార్మోనల్ సమస్యలు, అపరిశుభ్రత వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ సమయంలో రెడ్ నెస్, పొట్టనొప్పి, పెల్విక్ పెయిన్, దురద వంటి లక్షణాలు ఉంటే ఇంట్లోనే నేచురల్ రెమెడీస్‌తో సమస్యలను నివారించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
వైట్ డిశ్చార్జ్ సమస్యకు ఉసిరికాయలు చక్కగా చెక్ పెట్టగలవు. ఉసిరిలో సీ విటమిన్‌తో పాటు ఇమ్యూనిటీ పవర్ పెంచే సామర్ధ్యం అధికంగా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నవాళ్లు పరికడుపున ఉసిరి కాయలు తిండే చక్కటి ఫలితం ఉంటుంది. ఉసిరి గింజలను మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోని తిండే వైట్ డిశ్చార్జ్‌ను నివారించవచ్చు.
మెంతులు వైజినల్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. మెంతులను 12 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి, ఆ నీటిలో ఒక స్పూన్ తేనే కలుపుకోని పరికడుపున తాగితే ప్రయోజనం ఉంటుంది. వైజినల్ బ్యాక్టీరియా పెరగకుండా బెండకాయ ఎంతో ఉపయోగపడుతుంది. బెండకాయలను ఉడకపెట్టి ఆ నీటిని తాగాలి. లేదా బెండకాయ ముక్కలను నానబెట్టుకోని తిన్నా వైట్ డిశ్చార్జ్ సమస్యను నివారించుకోవచ్చు.
తులసి ఆకులను పేస్ట్ చేసుకోని తేనే కలుపుకోని తిన్నా.. దానిమ్మ గింజలు విరివిగా తీసుకున్నా సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే జామ ఆకులను ఉడక పెట్టుకోని ఆ నీటిని వడకట్టి, రోజుకు రెండు, మూడుసార్లు తాగినా ప్రయోజనం ఉంటుంది. ఎండిన అంజూరను రాత్రి వేళ్లల్లో వేడినీళ్లలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసుకోని పరికడుపున తాగాలి. అలాగే కుంకుమ పువ్వు, క్రాన్ బెర్రీని జ్యూస్ గా తీసుకున్నా వైట్ డిశ్చార్జ్ సమస్యను నివారించుకోవచ్చు. వంటింట్లో దొరికే వస్తువులతో తెల్లబట్టను అరికట్టవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే తప్పని సరిగా వైద్యులను సంప్రదించడం మేలు.