- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిమ్ యాక్టివేషన్ పేరుతో మోసం.. రూ.6.40 లక్షలు మాయం
దిశ, క్రైమ్ బ్యూరో : సిమ్ యాక్టివేషన్ పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు ఫోన్ చేసి వారి ఖాతాలను కొల్లగొడుతున్నారు. 24 గంటల్లో సిమ్ గడువు ముగిసిపోతున్నందున వెంటనే మీ నెట్ వర్క్ (ఎయిర్ టెల్) ను అప్ డేట్ చేసుకోవాలంటూ ఒక అపరిచిత వ్యక్తి నగరానికి చెందిన ఓ మహిళకు జనవరి 17న ఫోన్ చేశాడు. ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పడంతో నమ్మిన సదరు మహిళ మోసగాడు చెప్పినట్టుగా టీం వివర్ క్విక్ సపోర్ట్ రిమోట్ కంట్రోల్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంది. అతని ఆదేశాల ప్రకారం.. మహిళ తన ఖాతా నుంచి రూ.10 లు పంపడంతో మోసగాడు ఐదు సార్లు రూ.6.40 లక్షలను వెంటవెంటనే బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి తన ఖాతాలోకి డ్రా చేసుకున్నాడు.
ఈ విషయంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుడు జార్ఖండ్ రాష్ట్రం జాంతారా ప్రాంతానికి చెందిన బిర్ బాల్ పండిట్‌గా గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు రాచకొండ సీసీఎస్ ఏసీపీ హరినాథ్ తెలిపారు.