ఇదో మెదడు తక్కువ దందా !

by Anukaran |   ( Updated:2020-07-26 12:09:21.0  )
ఇదో మెదడు తక్కువ దందా !
X

దిశ, క్రైమ్​బ్యూరో: మెదడు వాపు వ్యాధికి చికిత్స చేయించాలంటూ నెటిజన్ల సానుభూతితో దందా చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంటున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్​ యంగ్​ కరేజ్​ పేరుతో ఫేస్​బుక్​ పేజీలో ఓ రోగికి వైద్య సాయం కావాలంటూ పోస్టు చూసినట్టుగా సల్మాన్​ ఖాన్​ చెప్పడంతో… మహమ్మద్​ ఇమ్రాన్​ స్పందించి తన ఖాతా నుంచి రోగి బంధువు అస్రా అకౌంట్​కు రూ.59,700 లను ట్రాన్స్​ఫర్​ చేశాడు.

తాను సాయం చేసిన తర్వాత కూడా మళ్లీ సోషల్​ మీడియాలో అస్రా పోస్టులను గమనించిన దాత ఇమ్రాన్​.. రోగి యాస్మిన్​ను వివరాలు అడిగి తెలుసుకోగా తనకు డబ్బులు చేరలేదని చెప్పాడు. వెంటనే తాను డబ్బు బదిలీ చేసిన ఎస్​బీఐ అకౌంట్​ స్టేట్​మెంట్​ వివరాలను గమనిచంగా మొత్తం రూ.15లక్షలు సేకరించినట్టుగా తెలిసింది. అంతేగాక ఈ సొమ్మును సల్మాన్​ ఖాన్​, అహ్మద్​ ఖాతాలకు బదిలీ చేసినట్టుగా ఉంది. సల్మాన్​‌ఖాన్​, అస్రా బేగం, అహ్మద్​‌లు వైద్య సాయం పేరిట నాటకం ఆడి సానుభూతిని సొమ్ము చేసుకుంటున్నట్టు ఇమ్రాన్​ తెలుసుకొని పొలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story