- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డబుల్’ ఫుల్ వసూల్
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో నగరంలో ఓ ముఠా ఫుల్లుగా వసూళ్లకు పాల్పడుతోంది. డబుల్ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పడంతో వారి మాయమాటలను నమ్మిన కొందరు వ్యక్తులు డబ్బులు చెల్లించారు. తీరా ఇళ్ల గురించి ప్రశ్నించే సరికి రేపు మాపు అనడంతో అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ ముఠాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు.ముఠా ప్రధాన సభ్యుడు షరియత్ అలీ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.ఇతడు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నట్టు సమాచారం.తనకు జీహెచ్ఎంసీలో పనిచేసే బడా అధికారులతో సంబంధాలు ఉన్నాయని, కొందరు మహిళల ద్వారా కస్టమర్లకు ‘ఎర’ వేయడం అతనికి పరిపాటిగా మారింది.ఇలా మాయమాటలు చెప్పి రూ.లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. డబుల్ ఇళ్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని, ఎవరైనా ఇప్పిస్తామని చెబితే నమ్మవద్దని వెస్ట్ జోన్ జాయింట్ సీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా, పరారీలో ఉన్నముఠా సభ్యుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.