తన నటనపై చార్మి షాకింగ్ కామెంట్.. ఇక ఎప్పటికీ అది చేయలేనేమో

by Anukaran |
తన నటనపై చార్మి షాకింగ్ కామెంట్.. ఇక ఎప్పటికీ అది చేయలేనేమో
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆడపులి, శివంగీ.. అంటూ తెరపై కుర్రకారు మదిని దోచిన ముద్దుగుమ్మ చార్మి. 15 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి ‘నీ తోడు కావాలి’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తన క్యూట్ స్మైల్ తో టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. లేటు వయస్సులో ప్రొడక్షన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న ఆమె.. పూరీ కనెక్ట్ పేరుతో ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థలో ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్న ఆమె ఇప్పుడు నిర్మాతగా బాధ్యతల బరువుల్ని మోస్తున్నారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వూలో చార్మి షాకింగ్ నిజాలను వెల్లడించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నుంచి ఈ అమ్మడు వ్యక్తిగత విషయాల వరకు ఎన్నో సవాల్లను ఎదుర్కొంది. తాజాగా.. హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’ అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి చార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైగర్ మూవీకి సంబంధించిన ఓ ఇంటర్వూలో చార్మి తన అభిమానులకు షాకిచ్చిందని చెప్పవచ్చు. తన నటనపై షాకింగ్ కాంమెంట్ చేసింది. ఒకప్పుడు హీరోయిన్ అయినా.. ఇప్పుడు నిర్మాతగా మారిన తర్వాత గాడిద చాకిరి చేయాల్సి వస్తోందన్నారు. నటన నిర్మాణం రెండు ఇష్టమే అయినా.. ఈ రెండింటికి అసలు పోలికే లేదని చెప్పుకచ్చారు.

హీరోయిన్‌గా చేసినప్పుడు ఫిట్ నెస్, బ్యూటీ మీద ఫోకస్ చేస్తే సరిపోయేదని కానీ, నిర్మతగా నిర్మాతగా మాత్రం అందరి కంఫర్ట్ చూడాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఇప్పటికి తనకు వారానికి రెండు.. మూడు ఆఫర్లు వస్తుంటాయని.. నటించమని అడుగుతారని చెప్పారు. నాకు నటన అంటే చాలా ఇష్టం అయినా.. నేను నిర్మాణ రంగంలో ఉన్న నేపథ్యంలో నటించే అవకాశం లేదన్నారు. ‘‘ఇక ఎప్పటికి నటించలేనేమో’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీని బట్టి చూస్తే ఇకపై శివంగి తెరపై కనిపించే ఛాన్స్ లేనట్టే కనిపిస్తుంది.

Advertisement

Next Story