- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చర్ల’కు టీఆర్ఎస్ మండల కమిటీ టీమ్ రెడీ.. వారి పేర్లు ఫైనల్.?
దిశ, భద్రాచలం : అధికార టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీలు ఒక్కొక్కటిగా ఫైనల్ అవుతున్నాయి. గ్రూపులు కట్టి పదవుల కోసం కొట్లాడిన నాయకులు ఒక్కోమెట్టు దిగి రాజీకి వస్తున్నారు. ఓ వర్గానికి అధ్యక్ష పదవి, మరో వర్గానికి కార్యదర్శి కట్టబెడుతూ పార్టీ పెద్దలు గ్రూపులను సమన్వయం చేస్తున్నారు. పార్టీలో ఎన్నికల వరకే విభేదాలని, ఆ తర్వాత అంతా కలిసి పనిచేయాల్సిందేనని మండల నేతలకు పార్టీ పెద్దలు గట్టిగా చెప్పి హెచ్చరిస్తున్నారు.
పార్టీకి ఏ రూపంలో నష్టం జరిగినా సహించేది లేదని పార్టీ పెద్దలు మందలించడంతో మండల నాయకులు పంతం వీడి రాజీకి రాకతప్పడంలేదు. ఈ నేపథ్యంలోనే చర్ల మండల అధ్యక్షునిగా సోయం రాజారావు(ఎస్‌టి), ప్రధాన కార్యదర్శిగా నక్కినబోయిన శ్రీనివాసరావు(బీసీ)లను పార్టీ పెద్దలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇద్దరు నాయకులు అధ్యక్ష పదవికోసం పోటీపడ్డారు. అయితే, మావోయిస్టు ప్రభావిత గిరిజన ప్రాంతం కావడంతో పార్టీ పెద్దలు అనేక కోణాల్లో ఆలోచించి సోయం రాజారావు వైపు మొగ్గుచూపడంతో ఆయనకు అధ్యక్ష పదవి రెండోసారి దక్కబోతోంది.
ఇక బీసీ వర్గానికి చెందిన శ్రీనివాసరావుని పార్టీ పెద్దలు బుజ్జిగించి కార్యదర్శిగా ఖరారు చేసినట్లు సమాచారం. ఇరుపక్షాల అంగీకారంతో ఈ పేర్లను పార్టీ పెద్దలు ఈ సాయంత్రమే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం.