నా టైటిల్‌ వాడుకోవడం కరెక్ట్ కాదు

by Shyam |
నా టైటిల్‌ వాడుకోవడం కరెక్ట్ కాదు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సినీ ప్రముఖుల భార్యల జీవితాలపై వస్తున్న వెబ్ సిరీస్ ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్‌‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ టైటిల్ విషయంలో ప్రస్తుతం ఓ వివాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్.. ఈ టైటిల్ మార్చాలంటూ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహర్‌‌తో పాటు దర్శకుడు అపూర్వ మెహతాకు ట్వీట్ చేశాడు.

‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ టైటిల్‌‌ను మధుర్ భండార్కర్ తన చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసుకున్నాడు. కాగా కరణ్ జోహర్, అపూర్వ మెహతాలు ఆ టైటిల్ కోసం అడిగితే.. భండార్కర్ సున్నితంగా తిరస్కరించాడు. అయితే భండార్కర్ అనుమతి లేకుండానే కరణ్, మెహతా తమ వెబ్ సిరీస్‌ను అదే పేరుతో విడుదల చేశారు. దాంతో భండార్కర్ టైటిల్ మార్చాలంటూ ట్వీట్ చేశాడు.

‘డియర్ కరణ్ జోహార్, అపూర్వ మెహతా.. వెబ్ కోసం మీరు నన్ను బాలీవుడ్ వైవ్స్ టైటిల్ అడిగారు, నేను తిరస్కరించాను. నా ప్రాజెక్ట్ నడుస్తోంది.. మోరల్లీ, ఎథికల్లీ నా టైటిల్‌ను మీరు వాడుకోవడం కరెక్ట్ కాదు. ప్లీజ్ నా సినిమాకు నష్టం తీసుకురాకండి. నేను చాలా వినయంతో ఈ టైటిల్ మార్చాలని మీకు విన్నవించుకుంటున్నాను’ అని మధుర్ ట్వీట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed