- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడింతలు తప్పదు.. జగన్‌కు బాబు వార్నింగ్
దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేయడంపై మండిపడ్డారు. జగన్ పాలనలో రాజ్యాంగం, చట్టం అడుగడుగునా దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. దేశంలో కరోనా కేసులు తగ్గినా ఏపీలో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు తగ్గడం లేదని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులకు, రౌడీ షీట్లకు భయపడే నేతలు టీడీపీలో ఎవరూ లేరని చెప్పుకొచ్చారు.
అధికారం ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మున్ముందు అంతకు మూడురెట్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజారెడ్డి రాజ్యాంగానికి మరో మూడేళ్ల వ్యాలిడిటీ ఉందంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం హరివర ప్రసాద్, కృష్ణమూర్తి, సురేశ్‌లపై నమోదు చేసిన అక్రమ రౌడీషీట్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
AP News :టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై లోకేశ్ హాట్ కామెంట్స్
- Tags
- Chandrababu
- Jagan