- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏది విధ్వంసమో.. ఏది అభివృద్ధో తెల్చుకోండి: బాబు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబు ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. ఏది అభివృద్ధో.. ఏది విధ్వంసమో ప్రజలే తేల్చుకోవాలని ఆయన అన్నారు. జగన్ అధికారం చేపట్టి.. 13 నెలలు అయిందని ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తమ హయాంలో దేశంలోనే తొలిసారి నదుల అనుసంధానం చేశామన్నారు. బందర్, కాకినాడ, బావనపాడు పోర్టులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీని మొదటి స్ధానంలో నిలిపామని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరంలో 72 శాతం పనులు పూర్తి చేశామని.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదని విమర్శించారు.
ఐదేళ్లలో రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదర్చుకున్నామని చంద్రబాబు తన హయాంలోనే జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. ‘‘అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేకు నాంది పలికాం. కర్నూలుకు ట్రిపుల్ ఐటీ, ఉర్దూ వర్సిటీ, సీడ్ పార్క్, ఎయిర్‌పోర్టును తీసుకొచ్చాం. విశాఖను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం’’. చంద్రబాబు తన హయాంలో జరిగిన వివిధ పనులను వివరించారు.