- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఓటుకు నోటు కేసులో తెరపైకి చంద్రబాబు పాత్ర
దిశ, క్రైమ్ బ్యూరో : ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై ఆధారాలు ఏమీ లేవని వాదిస్తున్న పలువురికి ఈ కేసులో ఏ4గా ఉన్న జెరూసలెం మత్తయ్య ఈడీకి ఇచ్చిన వాగ్మూల్మం సంచలనంగా మారుతోంది. దీంతో చంద్రబాబు నాయుడు చుట్టూ ఓటుకు నోటు కేసు ఉచ్చులా బిగుస్తోంది. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఓటుకు నోటు డీల్ కుదిరినట్టు జెరూసలెం మత్తయ్య స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డికి ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్ మద్దతుగా ఓటు వేస్తే రూ.5 కోట్లు ఇస్తామని, ఓటు వేయకుండా గైర్హాజరయితే రూ.3 కోట్లు ఇస్తామనే ఒప్పందం ప్రస్తావన వచ్చిందన్నారు. అంతే కాకుండా, జెరూసలెం వెళ్లేందుకు మరో రూ.3 కోట్లతో విమానాల టికెట్ తదితర ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు ఆ వాగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ ఒప్పందానికి స్టిఫెన్ సన్ అంగీకరిస్తే ముందస్తుగా రూ.50 లక్షల అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు తనతో చెప్పినట్టుగా మత్తయ్య తన వాగ్మూల్మంలో పేర్కొన్నాడు. అందుకు తనకు రూ.50 లక్షలు ఇస్తామన్నారని మత్తయ్య వివరించాడు.
సాధారణంగా నేను చర్చి పనిమీద టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో అక్కడే పనిచేసే జిమ్మిబాబు తనను చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలవాలని అనుకుంటున్నారని చెప్పాడు. దీంతో ఆరోజు చంద్రబాబును, రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పాడు. మరుసటి రోజు హిమాయత్ సాగర్ లో జరిగే మహానాడు వద్దకు రమ్మంటే వెళ్లాలని అన్నారు. మహానాడు వద్ద చంద్రబాబును కలిసినట్టు తెలిపారు.
2015లో మే నెలాఖరులో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి స్టిఫెన్ సన్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు స్టిఫిన్ సన్ వద్దకు వెళ్లిన సమయంలో ఈ డీల్ గురించి ప్రస్తావన చేశానన్నారు. అందుకు ఆయన చిన్న నవ్వు నవ్వినట్టు తెలిపారు. ఈ విషయంపై మరో ఇద్దరు మిత్రులతో కలిసి స్టిఫెన్ సన్ ను ఈ ఒప్పందానికి ఒప్పించినట్టు మత్తయ్య తెలిపారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి నాకు ఎవరైనా నాయకులు డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటుందనే ప్రస్తావన చేశాడని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీలో పనిచేసే క్రిస్టియన్ నాయకులతో కలిసి పలుమార్లు చర్చించిన పిదపనే స్టిఫెన్ సన్ కు అడ్వాన్స్ గా రూ.50 లక్షలు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి వెళ్లినట్టు తెలిపారు. అంతే కాకుండా, స్టిఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వబోతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత నేను మళ్లీ టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి చంద్రబాబు నాయుడిని, లోకేష్ ను కలిసి నా పరిస్థితి గురించి మాట్లాడినట్టు తెలిపారు.
దాదాపు ఐదేండ్ల క్రితం జరిగిన ఈ కేసులో స్టిఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టుగా వచ్చిన వాయిస్ కాల్ బహిర్గతం అయినప్పటికీ, చంద్రబాబుపై పూర్తి స్థాయి ఆధారాలు లేవనే వాదనలను టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈడీ అధికారులకు ఈ కేసులో ఏ4 గా ఉన్న జెరూసలెం మత్తయ్య నేను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడిన తర్వాతనే ఓటుకు నోటు డీల్ కుదిరినట్టు చెబుతుండడంతో ఈ కేసులో ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తోందో చూడాలి.