చంద్రబాబు నన్ను శపిస్తున్నారు: జగన్  

by srinivas |
Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విపత్తును చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ‘నేను గాల్లోనే వచ్చి గాల్లోనే పోతానంటున్నారు. శాశ్వతంగా కనుమరుగైపోతానంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఫినిష్ అయిపోతానంటున్నారు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారం. వరద సహాయక చర్యలు ఆగకూడదనే నేను వెళ్లలేదు. సీనియర్‌ అధికారుల సూచనల మేరకే ఆగిపోయా. నేను వెళ్లడం కన్నా బాధితులకు సహాయం అందడం ముఖ్యం. జిల్లాకొక సీనియర్‌ అధికారిని పంపాం. మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడే ఉండమన్నాం. నేను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూనే ఉన్నాను. సహాయక చర్యల తర్వాత ఖచ్చితంగా పర్యటిస్తా. హుద్‌హుద్‌, తిత్లీ తుఫానులను తానే ఆపానని చెప్పుకునే చంద్రబాబు నాడు బాధితులకు అరాకొర సహాయం కూడా చేయలేకపోయారంటూ అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed