- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎంపీ వైజాగ్‌లో విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నాడు: బాబు
విశాఖపట్టణంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి ట్రస్టు ముసుగులో బలవంతపు వసూళ్లకు, పంపిణీ ముసుగులో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని అన్నారు. కరోనా వైరస్ వైఎస్సార్సీపీ నేతల పాలిట ఏటీఎంగా మారిందని ఆయన ఆరోపిస్తూ, వీటిని నిరసిస్తూ మండల స్థాయిలో దీక్షలకు పిలుపునిచ్చారు.
12 గంటల దీక్షల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఓట్ల కక్కుర్తితో వైఎస్సార్సీపీకి చెందిన నేతలు గుంపులుగా తిరగడంతోనే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా వైరస్ ను వ్యాప్తి చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూలు కూడా ఒకటి కావడం ఆందోళనకరమని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతగా పని చేశామని, గతంలో అనేక విపత్తుల్లో ప్రజలకు అండగా నిలబడి సేవచేశామని గుర్తుచేశారు. కరోనా విపత్తులో కూడా బాధితులకు అండగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడమే అందరి లక్ష్యం కావాలని ఆయన సూచించారు.
ప్రభుత్వానికి తాము రాసిన లేఖల ద్వారా కొన్ని వర్గాలకు మేలు జరిగిందని, విశ్రాంత ఉద్యోగులకు ప్రయోజనం చేకూరిందని ఆయన వెల్లడించారు. అరువుపై ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులకు కల్పించిందని ప్రభుత్వంపై బాబు ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు భరోసా నుంచి విశాఖలోనే 32 వేల మంది రైతుల పేర్లు తీసేశారని, అదే, రాష్ట్ర వ్యాప్తంగా అయితే నాలుగు లక్షల పేర్లు తొలగించారని ఆయన ఆరోపించారు.
Tags: chandrababu naidu, tdp, ap, ysrcp, jagan, video conference