అదుపు చెయ్యకపోతే పెను ప్రమాదం: చంద్రబాబు

by srinivas |
అదుపు చెయ్యకపోతే పెను ప్రమాదం: చంద్రబాబు
X

కరోనా విజృంభన మొదలైతే అదుపు చెయ్యాడానికి కూడా ఏమీ ఉండదని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలో జనాభా ఎక్కువ కరోనాను ఈ దశలో అదుపు చెయ్యకపోతే కోట్లాది మందికి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తొలి కేసు చైనాలో నమోదైంది. అదిప్పుడు వందల మందికి సోకిందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడది సుమారు 3,76,000 మందికి సోకిందని సాయంత్రం లోపు 4,00,000కు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దీనిని సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలన్నారు. నిత్యావసరాల ధరలు అదుపులోకి తేవాలన్నారు. ఉపాధిహామీ కూలీలకు సాయం చెయ్యాలని తెలిపారు. రాజ్యసభ ఎన్నికలు వాయిదా వేసి కేంద్రం మంచి పని చేసిందని, అసెంబ్లీ సమావేశాలను ఏపీ వాయిదా వెయ్యాలని ఆయన సూచించారు.

Tags: chandrababu naidu, ap, tdp, corona

Advertisement

Next Story

Most Viewed