- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాణానికి చంద్రబాబు సిద్ధమా? డిప్యూటీ సీఎం సవాల్
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ డిప్యూటీ సీఎం కే. నారాయణ స్వామి మరో సవాల్ విసిరారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని తెగేసి చెప్పారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉప ముఖ్యమంత్రి హోదా వరకు నిజాయితీగా పనిచేశానని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా కృష్టాపురం, ఎన్టీఆర్ జలాశయాలు అభివృద్ధి చేయాలని సీఎం జగన్‌ను కోరినట్లు వెల్లడించారు.
జలాశయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారనీ..కుప్పం అభివృద్ధి చేస్తున్న ఘనత జగన్ అన్నదేనని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ విషయం వాస్తవమో కాదో చంద్రబాబు కుప్పం ప్రజలనే అడగాలని తెలిపారు. తనపై కావాలనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి చేయలేదని తాను కాణిపాకంలో సత్య ప్రయాణం చేయడానికి సిద్ధమని అన్నారు. చంద్రబాబు సిద్ధమా అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. తన పై వచ్చిన ఆరోపణలపై కావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించుకోవచ్చని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.