సీఎం కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేడు.. వైవీ సుబ్బారెడ్డి

by srinivas |
YV Subbareddy
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సెటైర్లు వేశారు. వైసీపీ అరాచక పాలన చేస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అరాచకాలు చేసే సంప్రదాయం వైసీపీకి..ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. అమరావతిలో ఏవిధంగా బూతులు తిట్టి, దాడులు చేయించుకుని, ఢిల్లీ వరకు రంకెలు వేసారో.. ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. కేంద్రం అసలు రాష్ట్రంలో అడుగుపెట్టవద్దు అన్నా బాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన కావాలని కోరడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ లేకపోతే చంద్రబాబు ఉండలేకపోతున్నారంటూ ధ్వజమెత్తారు. జలసీ, ఈర్శ్యతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని త్వరలో మరలా ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్ శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండిపోతారనే భయంతో చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే ప్రజలు ఓసారి బుద్ధి చెప్పారని మరోసారి కూడా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Advertisement

Next Story