రైతుల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు: కన్నబాబు

by srinivas |   ( Updated:2020-12-11 11:46:24.0  )
రైతుల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు: కన్నబాబు
X

దిశ,వెబ్ డెస్క్: సీఎం జగన్ రైతు పక్షపాతి అని మంత్రి కన్నబాబు అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. 33శాతం పంట నష్టపోతేనే పరిహారమంటూ బాబు హయాంలోనే జీవో వచ్చిందని తెలిపారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా నాటకాలు ఆడింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. తాము ఎప్పటికప్పుడూ ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామని వెల్లడించారు. రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement

Next Story