ఏకగ్రీవాలకు సహకరిస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

by srinivas |
ఏకగ్రీవాలకు సహకరిస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
X

దిశ,వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. డోన్‌తో పాటు పీప్పలి, జలదుర్గం, బేతంచెర్ల పోలీసు అధికారులపై ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష అభ్యర్థులపై పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీకి పోలీసులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసు అధికారులను మంత్రి బుగ్గన ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. డోన్‌లో జరుగుతున్న ఎన్నికల అక్రమాలపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story