2021 నాటికి 25 కోట్ల మందికి కరోనా..!

by vinod kumar |
2021 నాటికి 25 కోట్ల మందికి కరోనా..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో చాలా దేశాలు విఫలం అయ్యాయి. లాక్‌డౌన్ చేసినప్పటికీ వైరస్ వ్యాప్తి ఏ మాత్రం ఆగడంలేదు. అన్ని దేశాల్లో కరోనా కొరలు చాస్తూ ప్రజలతో పాటు పాలకులకు సైతం ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 11,981,313 కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారీన పడి 547,324 మంది చనిపోయారు. అయినా, వైరస్ ఏమాత్రం తగ్గకుండా.. తన వేగాన్ని మరింతగా పెంచుకుంటూ పోతోంది.

అయితే, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్(ఎంఐటీ) శాస్త్రవేత్తలు వేసిన అంచనా ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల కంటే మున్ముందు 12 రెట్లు ఎక్కువగా నమోదు కావడమే కాకుండా.. మరణాలు ఏకంగా 50 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. వైరస్ ఇప్పట్లో అదుపులోకి రాకపోతే.. 2021 నాటికి 25 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని వారి నివేదికలు చెబుతున్నాయి. మరో 18 లక్షల మంది మరణిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed