ఏపీకి భారీ వర్షసూచన

by srinivas |
ఏపీకి భారీ వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రం వైపు నుంచి వీస్తున్న పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం రాష్ట్రంపై ఉన్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed