- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కోచ్ పదవి మూడు రోజుల మురిపమే
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక దిగ్గజ పేసర్ చమిందా వాస్ ఆ దేశ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడో రోజే రాజీనామా చేశాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన సిరీస్‌లో బౌలింగ్ కోచ్ డేవిడ్ సకర్ పని తీరుపై శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) అసంతృప్తి వ్యక్తం చేసి.. అతడిని విధుల నుంచి తొలగించింది. వెంటనే చమిందా వాస్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, అతడిని కోచ్‌గా నియమించినా వేతనం విషయంలో బోర్డుతో రాజీ కుదరలేదు.
అతడు ఆశించినంత వేతనం చెల్లించకపోవడంతో వాస్ మూడు రోజులకే పదవికి రాజీనామా చేశాడు. వాస్ రాజీనామాపై ఎస్ఎల్‌సీ స్పందించింది. ‘చమిందా వాస్ కొన్ని నిబంధనలు విధించాడు. వాటికి మేము అంగీకరించలేదు. అందుకే రాజీనామా చేశాడు’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే కరోనా కారణంగా బోర్డు ఆర్థిక పరిస్థితి తలకిందులైందని.. ఈ సమయంలో వాస్ జీతంపై పేచీ పెట్టడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో శ్రీలంక జట్టు వెస్టిండీస్‌కు ప్రయాణం కావల్సి ఉండగా.. వాస్ రాజీనామా గందరగోళంలో పడేసింది.