- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టులకు రెడీనా.. రేవంత్‌కు సవాల్
దిశ, తెలంగాణ బ్యూరో: వైట్ ఛాలెంజ్ అంటే కాంగ్రేస్- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా నిల్చుంద్దాం టెస్టులు చేసుకుందాం… రెఢీనా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ కు రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ బాలరాజు మాట్లాడుతూ ఏ టెస్టుకైనా కేటీఆర్ సిద్ధమని… రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఒప్పిస్తారా? అని ప్రశ్నించారు. అమరుల స్తూపం దగ్గర అడుగుపెట్టే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. డబ్బుతో రేవంత్ రెడ్డి భజన పరులతో విమర్శలు టీఆర్ఎస్ పై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. గుర్తింపు కోసమే విమర్శలు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి యుద్ధం కాదు చేసేది ప్రజలను సాకుగా చూపి దందా చేస్తున్నారని మండిపడ్డారు.
పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ క్యారెక్టర్ లేని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిఅని క్యాడర్ లేని పార్టీ కాంగ్రేస్ అని దుయ్యబట్టారు. అమెరికాలోని బోస్టన్ టైమ్స్ పత్రికలో రాహుల్ గాంధీ డోపింగ్ టెస్ట్ లో దొరికాడని కథనాలు వచ్చాయన్నారు. కేటీఆర్ పై చాలెంజ్ చేయాలంటే ఓ రేంజ్ ఉండాలని… అది రేవంత్ రెడ్డికి లేదన్నారు. అభివృద్ధికి, ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కి దమ్ముంటే తెలంగాణకు నిధులు రప్పించే ఛాలెంజ్ ను బీజేపీ కి విసురాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఉంటే ఆధారాలుంటే డీజీపీ కి పిర్యాదు చేయాలని కాని ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ పరువు ప్రతిష్ట లను… హైదరాబాద్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్న రేవంత్ పై ప్రతి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ లో యువత ఆత్మహత్యలకు రేవంత్ ఉద్యమ ద్రోహమే కారణమని, చంద్రబాబు ఇంట్లో చొచ్చి టీడీపీ ని ఖతం చేశాడని, రాహుల్ ఇంట్లో చొచ్చి కాంగ్రెస్ ను ఖతం చేస్తాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్లు వాళ్ల పార్టీ ని రక్షించుకుంటే మంచిదని సూచించారు.
ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి.. తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడని దుయ్యబట్టారు. వెంట్రకతో సమానం అంటే… రేవంత్ రెడ్డి నా బొచ్చుగానితో సమానం అని నేను కూడా అనగలుగుతానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని డ్రగ్ టెస్టుకు ఒప్పించే దమ్ము ఉందా? అని సవాల్ చేశారు. రాహుల్ గాంధీని ఖతం పట్టించడానికి వేరేవాళ్లు అవసరం లేదని..రేవంత్ రెడ్డి ఒక్కడు చాలు అన్నారు. వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చడం వల్ల రాజకీయ పబ్బం గడుస్తుందని విమర్శలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు డ్రగ్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ నాయకత్వంలో గతసారి వచ్చిన ఎమ్మెల్యే స్థానాలు కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ కు రావు అన్నారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్, కేటీఆర్ లపై ఆరోపణలు మానుకోక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.