- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘చల్లా’ కు బిగుసుకుంటున్న కుల వివాదం
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కుల వివాదం బిగిసుకుంటోంది. ‘చిన్న కులాలకు చెందిన ఉన్నతాధికారులకు అక్షరం ముక్కరాదు. రాష్ట్రంలో ఏ ఆఫీసుకెళ్లిన వాళ్లే ఉంటున్నారు. ఇలాంటివారి వల్లే రాష్ట్రం నాశనమవుతోంది’ అంటూ ఇటీవల ఒక కుల సంఘం కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా చేసిన వ్యాఖ్యలపై క్రమంగా అగ్గిరాజుకుంటోంది. జరిగిన తప్పిదాన్ని గుర్తించిన ఎమ్మెల్యే చల్లా తాను ఉద్దేశ పూర్వకంగా ఎవరినీ కించపరిచాలని వ్యాఖ్యలు చేయలేదంటూనే, తన మాటలతో ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలంటున్నారు.
మొదట కుల సంఘాల నాయకుల నుంచి పెద్దగా ప్రతిస్పందన కనిపించకపోయినా రెండు రోజులుగా చల్లాపై విమర్శలు ఎక్కువయ్యాయి. చల్లా వ్యాఖ్యలను ఇటు సొంత పార్టీ నేతలు కూడా సమర్థించడం లేదు.ఆయన తప్పును బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల్ని కించపరుస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ కె.రాములు ఫిర్యాదు చేశారు.