నాగార్జునతో బిగ్ బాస్ కంటెస్టెంట్ మ్యారేజ్.. పీఎస్‌లో లొల్లి

by Jakkula Samataha |   ( Updated:2021-03-29 01:55:35.0  )
నాగార్జునతో బిగ్ బాస్ కంటెస్టెంట్ మ్యారేజ్.. పీఎస్‌లో లొల్లి
X

దిశ, సినిమా : కన్నడ యాక్ట్రెస్ చైత్ర కొట్టూర్ మ్యారేజ్ ఇష్యూ వైరల్ అయింది. ఆదివారం ఉదయం బెంగళూరులోని ఓ గణపతి ఆలయంలో నాగార్జున అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది చైత్ర. అయితే ఇది బలవంతపు పెళ్లి అని సాయంత్రం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు నాగార్జున. తనకు ఇష్టం లేకపోయినా కొన్ని సంస్థల సభ్యులు బలవంతంగా తనకు వివాహం చేశారని పేర్కొన్నాడు.

అయితే నాగార్జున, తాను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని, నాగార్జున కుటుంబీకులు తనకు బ్రెయిన్ వాష్ చేయడంతో ఇలా కంప్లెయింట్ చేశాడని చెప్పింది చైత్ర. వివాహం తర్వాత కోలార్‌లోని కురుబారపేటలో ఉన్న తమ నివాసానికి చేరుకున్న నాగార్జున ఫ్యామిలీ బీభత్సం చేశారని, అమ్మానాన్న, అన్నపై చేయిచేసుకున్నారని చైత్ర ఆరోపించింది. ఆ తర్వాత నాగార్జునను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి బలవంతంగా ఫిర్యాదు చేయించారని తెలిపింది.

Advertisement

Next Story