- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాడ్విక్ మరణంతో ‘బ్లాక్ పాంథర్ 2’కు చిక్కులు!
దిశ, వెబ్‌డెస్క్: కింగ్ టచాల్లా అలియాస్ బ్లాక్ పాంథర్ పాత్రతో అందరి మనసుల్లోనూ పాతుకుపోయిన హాలీవుడ్ నటుడు చాడ్విక్ బోస్‌మన్ ఇటీవల కోలన్ కేన్సర్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో మార్వెల్ వారు ముందే ప్లాన్ చేసిన ‘బ్లాక్ పాంథర్ 2’ సినిమా నిర్మాణం చిక్కుల్లో పడింది. సంస్కృతి పరంగా, రిప్రజెంటేషన్ పరంగా నల్లజాతీయులకు ఒక గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమా ఇది. పూర్తిగా నల్లజాతికి చెందిన నటీనటులతో ఆఫ్రికా సంస్కృతిని పాశ్చాత్య ప్రపంచానికి ఒక కొత్త రూపంలో చూపించిన సినిమా ఇది. అలాంటి సినిమాకు చాడ్విక్ బోస్‌మన్ ఒక టార్చ్ బేరర్‌గా నిలిచాడు. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో బ్లాక్ పాంథర్ 2 సినిమాలో ఆయన పాత్రను వేరే నల్లజాతి నటుడితో రీప్లేస్ చేయకూడదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో మార్వెల్ పితృ సంస్థ వాల్ట్ డిస్నీ వారు సందిగ్ధంలో పడ్డారు. అందుకు కొన్ని ఐడియాలను కూడా అభిమానులు ఇవ్వడంతో వారు చెప్పినట్లుగా ఫాలో అవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ ఆ ఐడియాలు ఏంటి?
సినిమాలో హీరోను వేరే హీరోతో మార్చకుండా చాడ్విక్ బోస్‌మన్ పాత్రకు ఒక న్యాయం ప్రకటిస్తూ ముగింపుతో నివాళి అర్పించాలని అభిమానులు కోరుతున్నారు. బ్లాక్ పాంథర్ బాధ్యతలను అతని చెల్లి షూరికి అప్పజెప్పేలా కథకు ఒక రూపాన్ని ఇవ్వాలని అభిమానులు ఒక ఐడియా ఇచ్చారు. నిజానికి బ్లాక్ పాంథర్‌కు ఉండాల్సిన లక్షణాలన్నీ షూరికి ఉన్నాయి. వకాండాలో టెక్నికల్ జీనియస్‌గా కొత్త కొత్త పరికరాలను సృష్టించడమే కాకుండా షూరీ ఫైట్‌లు కూడా చేసింది. కామిక్ పుస్తకాల్లో ఎలాగూ ఇలా జరిగింది కాబట్టి ఈ విషయం గురించి షూరీ పాత్ర పోషించిన లెటిషియా రైట్‌ను అడిగినపుడు ఆమె దీని గురించి ఏమీ స్పందించలేదు కానీ, చాడ్విక్ బోస్‌మన్‌కు న్యాయం చేయాలని కోరారు. ఇది మాత్రమే కాకుండా బ్లాక్ పాంథర్ పాత్రను యువకుడిగా చిత్రీకరిస్తూ ఆ యువ బ్లాక్ పాంథర్ పాత్రలో కొత్త హీరోను పెట్టడాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నట్లు సీనియర్ రైటర్ జమిల్ స్మిత్ వెల్లడించారు. ఏదేమైనా చాడ్విక్ బోస్‌మన్ ఆకస్మిక మరణం అటు అభిమానులకు, ఇటు బ్లాక్ పాంథర్ సినిమాకు తీరని లోటుగా మిగిలిపోయింది.