కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి : చాడ

by Shyam |
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలి : చాడ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.రోజుకూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని చాడ విమర్శించారు.అంతేకాకుండా రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచి, భయాందోళనకు గురవుతున్న ప్రజలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed