రీ-పేమెంట్‌కు నగదు వాడకుండా చూడండి

by Harish |
రీ-పేమెంట్‌కు నగదు వాడకుండా చూడండి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆరు డెట్ ఫండ్‌లను మూసేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంక్ రుణాల రీ-పేమెంట్‌కు నగదు వినియోగించకుండా చూడాలని ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కన్‌స్ట్రక్షన్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(సీఎఫ్ఎంఏ).. సెబీని అభ్యర్థించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏప్రిల్ చివరి వారంలో ఆరు డెట్ ఫండ్‌లను నిలిపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 40 వేల మంది ఇన్వెస్టర్లు వారికి రావాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్న వేళ రీ-పేమెంట్స్ కోసం నగదు ఉపయోగించుకోవడం సరైనది కాదని సీఎఫ్ఎంఏ అభిప్రాయపడింది. ఈ నెల ప్రారంభం నుంచి కొనుగోళ్లపై స్టాంప్ డ్యూటీ అమలవుతోంది. డెట్, సిస్టమేటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్, ఈక్విటీ లాంటి వాటిపై సైతం ఈ నిబంధనలను అమలయ్యాయి. అధికంగా డెట్ ఫండ్స్‌పై ఈ ప్రభావం ఉంటుంది. కొనుగోలు, స్విచ్ ఇన్ అమౌంట్‌పై 0.005 శాతం, డీమ్యాట్ ఖాతాల బదిలీపై 0.015 శాతం అమలవుతోందని సీఎఫ్ఎంఏ పేర్కొంది. 90 రోజుల కంటే తక్కువ సమయం మ్యూచువల్ ఫండ్స్ ఉంచుకునే వారిపై స్టాంప్ డ్యూటీ ప్రభావం ఎక్కువ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed