- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తగ్గుతున్న వంటనూనెల టోకు ధరలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సరఫరాను పెంచడం, పన్నుల తగ్గింపు నిర్ణయాలతో టోకు మార్కెట్లలో పలు రకాల వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయని ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో మార్కెట్లో వంటనూనెల ధరల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న టోకు మార్కెట్లలో ఎనిమిది రకాల వంటనూనెల ధరలు వారం రోజులుగా తగ్గుతున్న ధోరణిని చూపిస్తున్నట్టు తెలిపింది. ఈ వారాంతం నాటికి వేరుశెనగ, ఆవనూనె, వనస్పతి, పొద్దుతిరుగుడు నూనె, పామాయిల్, కొబ్బరి నూనె, నువ్వుల నూనెల హోల్‌సేల్ ధరలు తగ్గాయని ప్రభుత్వం పేర్కొంది.
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. పామాయిల్ టోకు ధర 2.50 శాతం తగ్గి టన్ను రూ. 12,666గా ఉంది. వేరుశెనగ నూనె 1.38 శాతం తగ్గి రూ. 16,839గా ఉందని, నువ్వుల నూనె టన్నుకు 2.08 శాతం తగ్గి రూ. 23,500, కొబ్బరి నూనె 1.72 శాతం క్షీణించి రూ. 17,100కు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది. ఆవనూనె 1 శాతం కంటే తక్కువ తగ్గి టన్నుకు రూ. 16,573, వనస్పతి 1 శాతం తగ్గి రూ. 12,508గా ఉంది. పొద్దుతిరుగుడు నూనె 1.30 శాతం తగ్గి రూ. 15,965కి చేరుకుంది. అయితే, ఇటీవల వంటనూనెల ధరలు తగ్గుతున్నప్పటికీ గతేడాది స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.