- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు విమానాశ్రయాల్లో మిగిలిన వాటాలను విక్రయించనున్న కేంద్రం!
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే ప్రైవేటీకరించిన ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో మిగిలిన వాటాను విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. రూ. 2.5 లక్షల కోట్ల విలువైన వనరులను నిధుల కిందకు మార్చాలన్న లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత విమానాశ్రయ అథారిటీ(ఏఏఐ)కి ఈ నాలుగు విమానాశ్రయాల్లో ఉన్న వాటాను కేంద్రం విక్రయించనుంది. వీటిలో ఏఏఐకి 26 శాతం వాటాలున్నాయి. అంతేకాకుండా 2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో 13 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు గుర్తించినట్టు సాధికారిక కమిటీ తెలిపింది. పై నాలుగు విమానాశ్రయాల్లో ఈక్విటీ వాటాల విక్రయానికి సంబంధించి అవసరమైన అనుమతులను త్వరలో మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది. కాగా, పౌర విమానాశాఖ పరిధిలో ఉన్న ఏఏఐ అధీనంలో సుమారు 100 విమానాశ్రయాలు ఉన్నాయి.
విమానాశ్రయాల మొదటి దశ ప్రైవేటీకరణ గతేడాది జరిగింది. ఆ సమయంలో అహ్మదాబాద్, తిరవనంతపురం, లఖ్‌నవూ, జైపూర్, గుహవటి విమానాశ్రాయాలను అదానీ కంపెనీలు దక్కించుకున్నాయి. గత నెల 1న పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..కొత్త మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధుల కోసం ప్రజా మౌలిక సదుపాయాల ఆస్తుల ద్వారా నగదును ఆర్జించాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలో రూ.1.75 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను నిధులుగా మార్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.