పండుగకు వడ్డీపై వడ్డీ మాఫీ చేసే అవకాశం…

by Harish |
పండుగకు వడ్డీపై వడ్డీ మాఫీ చేసే అవకాశం…
X

దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ కాలంలో మారటోరియం వెసులుబాటును వినియోగించకుండా ఈఎంఐలు కట్టినవారికి త్వరలో కేంద్రం శుభవార్త అందించనుంది. రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి పండుగ సమయానికి అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్‌బీఐ మారటోరియం వెసులుబాటును ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వెసులుబాటు మార్చి 1 నుంచి ఆగష్టు 31 వరకు అమలైంది.

ఈ సమయంలో ఎక్కువమంది ఈఎంఐలను చెల్లించలేదు. కొందరు చెల్లించగలిగారు. ఆరునెలలు మారటోరియం ఉపయోగించిన వారితో పాటు ఆరు నెలలు ఈఎంఐలను చెల్లించిన వారికి కూడా వడ్డీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. రూ. 2 కోట్లలోపు వ్యక్తిగత, గృహరుణాలను తీసుకుని ఈఎంఐ సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. నిపుణుల సూచనల ప్రకారం.. ఈ మినహాయింపును ఆరు నెలల కాలానికి అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed