- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేహ్ చైనాలో.. ట్విట్టర్ సీఈవోకి కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ మ్యాప్‌ను తప్పుగా చూపించిన ట్విట్టర్‌పై కేంద్రం మండిపడింది. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జమ్ము కశ్మీర్‌లోని లేహ్ జియో లొకేషన్‌ను చైనా రిపబ్లిక్‌లో ట్విట్టర్ లొకేషన్ సెట్టింగ్ చూపెట్టింది. భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసే చర్యలకు మైక్రోబ్లాగింగ్ సైట్ పూనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ సానీ లేఖ రాశారు.
కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్‌కు లేహ్ హెడ్‌క్వార్టర్ అని, భారత భూభాగంలో లడాఖ్, జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్భాగమని స్పష్టం చేశారు. మ్యాప్ ద్వారా భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ప్రయత్నాలు చేసినా ఆమోదించబోమని, అది చట్ట ఉల్లంఘన అని వివరించారు. భారతీయుల భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. ఇలాంటి ప్రయత్నాలు ట్విట్టర్‌కు ఉన్న ప్రతిష్టను మసకబారుస్తుందని, సంస్థ తటస్థ వైఖరిపై అనుమానాలను రేకెత్తిస్తుందని హెచ్చరించారు.