వలస కూలీల కోసం ప్రత్యేక పోర్టల్

by Shamantha N |
వలస కూలీల కోసం ప్రత్యేక పోర్టల్
X

న్యూఢిల్లీ: వలస కూలీలు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంతూళ్లకు బయల్దేరిన వలస కూలీల వివరాలను సేకరించి.. వారిని సురక్షితంగా ఇంటికి తరలించే చర్యల్లో భాగంగా ఓ ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీల సమాచారాన్ని సేకరించేందుకు, అలాగే, వారికి ప్రయాణ సదుపాయాన్ని కల్పించేందుకు వీలుగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) ఆధ్వర్యంలో నేషనల్ మైగ్రాంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎన్ఎంఐఎస్) అనే డ్యాష్‌ బోర్డును డెవలప్ చేసింది. ఈ మేరకు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఓ లేఖ రాశారు. ఈ పోర్టల్ వలస కార్మికుల వివరాలకు ఒక స్టోరేజీగా ఉపయోగపడుతుందని.. రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఉపకరిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీల డేటాను ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed