- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ 5 రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై కేంద్రం ఫోకస్
by Shamantha N |

X
న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా నమోదవుతున్న ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్ర బృందాలు పర్యవేక్షించనున్నాయి. కేరళ, కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్‌లను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులు లేదా జాయింట్ సెక్రెటరీ, ప్రజా ఆరోగ్య నిపుణుడు, క్లినీషియన్‌లు ఈ బృందంలో ఉండనున్నారు. కరోనా సర్వేలెన్స్, టెస్టులు, వ్యాప్తి నివారణ, కట్టడి చర్యలు, పాజిటివ్ కేసులకు చికిత్స వంటి విషయాల్లో ఈ బృందాలు రాష్ట్రాలకు చేదోడువాదోడుగా ఉండనున్నాయి.
Next Story