- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగరంలో కేంద్రబృందం పర్యటన..
దిశ, న్యూస్ బ్యూరో: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం గురువారం నగరంలో విస్తృతంగా పర్యటించింది. కోఠి మెటర్నిటీ ఆస్పత్రిని సందర్శించిన బృందం.. లాక్‌డౌన్ నేపథ్యంలో అందిస్తున్న మెటర్నిటీ సేవల గురించి వైద్యాధికారులు, సిబ్బందిని వాకబు చేశారు. అనంతరం ఎల్బీనగర్ జోన్‌లో ఉన్న ఉప్పల్ నైట్ షెల్టర్‌తో పాటు మార్కెట్‌ను సందర్శించారు. చింతల్‌కుంట కంటైన్‌మెంట్ జోన్‌ను తనిఖీచేసి, కొవిడ్-19 నివారణకు చేపట్టిన చర్యలు, కంటైన్‌మెంట్ జోన్‌లో ఉన్న కుటుంబాలకు అందిస్తోన్న సేవల గురించి తెలుసుకున్నారు. తదుపరి ఫీవర్ హాస్పిటల్‌ను సందర్శించారు.
ఈ బృందంలో కేంద్ర ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహర సంస్థ డైరెక్టర్ హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్. ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్లు డా.ఎన్. రవికిరణ్, బి. శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, ఆయా ప్రాంతాల డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.
Tags: Lockdown, GHMC, corona, Koti, Hospital