ఆదిలాబాద్‌ జిల్లాలో కేంద్ర బలగాలు.. ఎందుకంటే..?

by Aamani |
ఆదిలాబాద్‌ జిల్లాలో కేంద్ర బలగాలు.. ఎందుకంటే..?
X

దిశ, ఆదిలాబాద్: కేంద్ర రాపిడ్ యాక్షన్ బలగాలు జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటారని జిల్లా ఎస్పి ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం జిల్లాకు రెండు కంపెనీల బలగాలు చేరుకొని ఇన్‌చార్జీ డిప్యూటీ కమాండర్ అలోక్ కుమార్ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి రిపోర్ట్ చేశారు. అనంతరం బలగాలను స్థానిక పోలీస్ శిక్షణ కేంద్రంలో వసతి కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 9 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు.

మొదటిరోజు స్థానిక ఒకటవ, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ చేస్తూ పర్యటిస్తారన్నారు. రెండో రోజు ఇచ్చోడ, నేరడిగొండ, మండలం కేంద్రాల్లో సమస్యాత్మక కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ప్రార్ధనా స్థలాల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారని తెలిపారు. 3వరోజు ఉట్నూర్, నార్నూర్ మండల కేంద్రంలోని సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో నేరుగా కలిసి సమస్యలను తెలుసుకోని 4వ రోజు బోథ్, బజార్హత్నూర్, మండల కేంద్రాల్లో పర్యటించి, అన్ని వర్గాల ప్రజలతో సమావేశమై మాట్లాడతారని స్పష్టం చేశారు. చివరి రోజున ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, మండలాల్లో పర్యటించి, గ్రామ మత పెద్దలతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యలపై చర్చించి అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి పర్యటన వివరాలను జిల్లా ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ జి మల్లేష్, ఆర్ఏఎఫ్ ఇన్‌స్పెక్టర్లు సీకే రెడ్డి, ఆర్కే పాండా, 100 మంది కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed