‘కరోనా పరిస్థితుల’పై కేంద్ర మంత్రుల సమావేశం

by vinod kumar |   ( Updated:2020-04-18 04:05:42.0  )
‘కరోనా పరిస్థితుల’పై కేంద్ర మంత్రుల సమావేశం
X

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆయన నివాసంలో కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. కరోనా ఆపత్కాలంల్ దేశంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు, వాటికి పరిష్కారాలు, అందులో కేంద్ర మంత్రిత్వ శాఖల పాత్రవంటి అంశాలపై చర్చించినట్టు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ నిబంధనల సడలింపు నిర్ణయం, ఆర్బీఐ తీసుకున్న చర్యలను వారు సమర్థించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్‌లు పాల్గొన్నారు.

tags..coronavirus, central ministers, defence minister, rajnath singh, meet

Advertisement

Next Story