సుశాంత్ కుటుంబానికి కేంద్ర మంత్రి పరామర్శ

by Shyam |
సుశాంత్ కుటుంబానికి కేంద్ర మంత్రి పరామర్శ
X

కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నివాళులు అర్పించారు. పాట్నాలోని సుశాంత్ ఇంటిని సందర్శించిన మంత్రి.. సుశాంత్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. యంగ్ టాలెంటెడ్ హీరో ఇంత తొందరగా మన నుంచి వెళ్లిపోవడం బాధాకరమని తెలిపాడు. తన మరణంతో సినిమా సృజనాత్మకత తగ్గిందని అనిపిస్తోందని అన్నారు. తను మరిన్ని గొప్ప శిఖరాలను అధిరోహించాల్సి ఉన్నా.. మరెన్నో కీర్తి ప్రతిష్టలు పొందేందుకు అర్హత ఉన్నా.. అవేవీ తీరకుండానే వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story