దళారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

by Ramesh Goud |
దళారులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
X

దిశ, న్యూస్ బ్యూరో :
కేంద్ర ప్రభుత్వం కందులకు మద్దతు ధర కల్పిస్తున్నప్పటికీ దళారుల కారణంగా రైతులకు ప్రోత్సాహకం అందడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దళారులను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందినదని ఆయన ఆదివారం విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కందులు, పత్తి కొనుగోలుపై అధికారుల నుంచి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు.ఈ సారి అత్యధిక కందుల కొనుగోలు విషయంలో కేంద్రం రైతులకు మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో ఎన్నో ఏండ్లుగా పాతకుపోయిన దళారుల కారణంగా రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. దళారులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తెలంగాణలో కందుల ఉత్పత్తి అంచనా మేరకు 25 శాతం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా 51 వేల 625 మెట్రిక్ టన్స్ కొనుగోలుకు కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రూ. 266 కోట్ల నాఫెడ్ ద్వారా మార్క్‌ఫెడ్‌కు నిధులు బదలాయించినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ఒక్క టన్ను కందులు కూడా కొనుగోలు చేయలేదని, నేటికి 65 వేల మెట్రిక్ టన్నుల కందులను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. కేవలం కందుల కొనుగోలుకు రూ. 879 కోట్ల ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. రాష్ట్రం నుంచి 20లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తుచేశారు.

tags :brokers, in markfed, grams, central minister kishan reddy, ts govt fails to purchase corns’

Advertisement

Next Story

Most Viewed