కేంద్రమంత్రి టోక్యో పర్యటన వాయిదా

by sudharani |
కేంద్రమంత్రి టోక్యో పర్యటన వాయిదా
X

న్యూఢిల్లీ: జపాన్‌లో జరగనున్న ఒలంపిక్స్‌లో భారత అథ్లెట్ల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడానికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 25న టోక్యోలో పర్యటించాల్సి ఉండగా, కరోనా విజృంభణతో వాయిదా పడింది. ఈ మేరకు కిరణ్ తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. 25 నుంచి 29వరకు తన నేతృత్వంలో ఇండియన్ ఒలంపిక్ కమిటీ ప్రతినిధులతో ఈ పర్యటన జరగాల్సి ఉండగా.. తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. తిరిగి ఎప్పుడు వెళ్లేది తర్వాత తెలియజేస్తామని స్పష్టం చేశారు.

tags:central minister, kiren rijiju, japan tour, tokyo, coronavirus, sports minister

Advertisement

Next Story