- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కారు’ను గుద్దిన ‘బండి’.. వాటిపై కేంద్రం విచారణ!
దిశ, వెబ్‌డెస్క్ :
శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో సంభవించిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సీఐడీతో విచారణ కూడా జరిపిస్తోంది. అయితే, శ్రీశైలం అగ్నిప్రమాదం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో దాస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ప్రమాదానికి సంబంధించి కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రమాదం జరగడానికి ముందు అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను కూడా కేంద్రమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి తెలంగాణలోని హైడల్ పవర్ ప్రాజెక్టులపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపినట్లు ఎంపీ బండి సంజయ్ స్పష్టంచేశారు.