ఫ్లాష్ ఫ్లాష్ : దేశంలో మరో కొత్త వేరియంట్.. ‘కప్పా’తో జాగ్రత్త..!

by vinod kumar |   ( Updated:2021-07-14 04:21:18.0  )
kappa-veriant
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త వేరియంట్లు వెలుగు చూస్తున్నాయి. త్వరలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తున్న తరుణంలో.. ఇండియాలో కొత్త వేరియంట్లు వెలుగు చూడటం కొంత ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వేరియంట్ వైరస్ చాలా ప్రమాదకరమని ఇప్పటికే ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలోనూ డెల్టా వేరియంట్ కేసులు అక్కడక్కడా నమోదయ్యాయి. తాజాగా వైరస్ మ్యుటేట్ కొనసాగి ‘కప్పా’ వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ మంగళవారం ప్రకటించారు.

రాజస్థాన్ రాష్ట్రంలో తొలిసారిగా కప్పా వేరియంట్ గుర్తించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఒక్కరోజులోనే 11 కప్పా వేరియంట్ కేసులు వెలుగు చూసినట్లు వెల్లడించారు. అల్వార్‌లో నాలుగు జైపూర్ నుంచి నాలుగు కేసులు.. బార్మర్‌లో రెండు, బిల్వారలో ఒక్క కేసును గుర్తించామన్నారు. అయితే, కప్పా వేరియంట్ అనేది డెల్టా వేరియంట్ కంటే పెద్ద ప్రమాదమేమి కాదని కేంద్రమంత్రి ప్రకటించారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Advertisement

Next Story