ఏపీ మెరుగైన స్థితిలోనే ఉంది: కేంద్ర వైద్యఆరోగ్య శాఖ

by srinivas |
ఏపీ మెరుగైన స్థితిలోనే ఉంది: కేంద్ర వైద్యఆరోగ్య శాఖ
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి, నిరోధంపై ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలో కరోన్ వైరస్ వ్యాప్తి లాక్‌డౌన్‌కు ముందు 3.4 రోజులకోసారి రెట్టింపయ్యేదని తెలిపారు. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ఇప్పుడు కరోనా 7.5 రోజులకు రెట్టింపవుతోందని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ రెట్టింపు రేటు జాతీయ రేటుతో పోలిస్తే తక్కువగా ఉందని అన్నారు. జాతీయ స్థాయిలో కరోనా వైరస్ కేసులు 7.5 రోజులకు రెట్టింపైతే.. ఏపీలో 10.6 రోజులకు రెట్టింపు అవుతున్నాయని, తెలంగాణలో 9.4 రోజుల్లో రెట్టింపవుతున్నాయని తెలిపారు. ఇది మెరుగైన స్ధితేనని ఆయన చెప్పారు. అయితే ఇది ఇంకా మెరుగుకావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే నాటికి ఇది ఒక కొలిక్కి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి 722 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన రెండు రోజుల్లో ఈ నాలుగు జిల్లాల్లో భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ వైద్యఆరోగ్య శాఖాధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Tags:india, map, coronavirus, covid-19, central health department, lav agarwal

Advertisement

Next Story

Most Viewed