తెలంగాణకు రూ.606.88 కోట్ల కేంద్ర గ్రాంటు

by Shamantha N |
తెలంగాణకు రూ.606.88 కోట్ల కేంద్ర గ్రాంటు
X

దిశ‌, తెలంగాణ బ్యూరో : ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి గ్రామీణ రహదారులు, విస్తరణ, వంతెనల నిర్మాణం కోసం రూ.606.88 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు రాష్ట్రం తన వాటాగా రూ.413.73 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారమందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లు మంజూరు చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కేంద్ర సర్కార్ తాజాగా కేటాయించిన నిధులకు రాష్ట్ర సర్కార్ వెంటనే మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేసి రహదారుల నిర్మాణం, విస్తరణకు తోడ్పాటును అందించాలన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story