కేంద్రం కొత్త కంటైన్మెంట్ గైడ్‌లైన్స్

by Shamantha N |   ( Updated:2021-05-16 04:21:59.0  )
కేంద్రం కొత్త కంటైన్మెంట్ గైడ్‌లైన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొవిడ్ కంటైన్మెంట్ మార్గదర్శకాలు జారీ చేసింది. స్వల్ప లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని సూచించింది. ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, ఆక్సిజన్ స్థాయి పడిపోయినప్పుడు మాత్రమే పెద్ద ఆస్పత్రులకు తరలించాలని సూచించింది.

సెకండ్ వేవ్ లో దాదాపు 85 శాతం మందిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. గ్రామీణ ప్రజల్లో తీవ్ర అనారోగ్యం, శ్వాస సమస్యలపై నిఘా ఉంచాలని, ఆశా , ఆరోగ్య కార్యకర్తలతో కరోనా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్నవారికి టెలిమెడిసిన్ సేవలు అందించాలంది.

Advertisement

Next Story

Most Viewed