- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ రాజధాని విశాఖే.. స్పష్టం చేసిన కేంద్రం
దిశ, వెబ్ డెస్క్ : అమరావతి రాజధానిగా కొనసాగించాలి అని టీడీపీ చేస్తున్న నిరసనలకు షాక్ తగిలింది. అమరావతిని కాదని కేంద్రం విశాక కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టీడీపీ నాయకులు చేస్తున్న ‘సేవ్ అమరావతి ’ కి రెడ్ మార్క్ పడినట్టు కనిపిస్తోంది. ఇటీవల కేంద్రం విడుదల చేసిన దేశ వ్యాప్త పెట్రోల్ ట్యాక్స్ ల వివరాలలో ఏపీ రాజధానిగా విశాఖపట్టణాన్ని గుర్తిస్తూ జీవో జారీ చేసింది. మూడు రాజధానులతోనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుందన్న జగన్ కల సాకారం అయింది. మూడు రాజధానులే ముద్దు అంటూ ప్రచారం చేస్తున్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు తన మాట నెగ్గించుకుంది.
ఇంతకాలం రాజధాని నిర్ణయం రాష్ట్రపతి చేతిలో ఉండగా, ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన ఈ ఉత్తర్వులను చూస్తుంటే విశాఖనే రాజధానిగా గుర్తించినట్టు కనిపిస్తోంది. అయితే ఈ ఉత్తర్వుల పై టీడీపీ నాయకులు గానీ , చంద్రబాబు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి పేరుతో టీడీపీ నాయకులు చేస్తున్న దీక్షలు ఇక చాలు అంటూ వైసీపీ వర్గం సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత బాబు మాత్రం చేసేది ఏముంది అని పలువురు వైసీపీ నాయకులు అంటున్నారు.