రైల్వేలో ‘క్యాటర్స్ అండ్ టూరిజం’ షేర్స్ విక్రయం?

by Shamantha N |
రైల్వేలో ‘క్యాటర్స్ అండ్ టూరిజం’ షేర్స్ విక్రయం?
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే (Indian railway) పై మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైల్వే ‘క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్’ (Irctc)లోని తన వాటాల్లో కొన్ని షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (Ofs) ద్వారా విక్రయించాలని (అమ్మకం) యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టబడులకు సంబంధించిన సంస్థ (Dipam) అమ్మకాల ప్రక్రియను నిర్వహించేందుకు సెప్టెంబర్ 10లోగా సెక్యూరిటీస్ అండ్ ఎక్సెంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Sebi)లో నమోదు చేసుకున్న మర్చంట్ బ్యాంకర్ల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తోంది. కాగా, Sebi నియమ నిబంధనలకు అనుగుణంగానే షేర్ల అమ్మకాలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

మరోవైపు రెల్వేలో పనిచేసే ఉద్యోగులకు అర్హత ఉంటే షేర్లలో డిస్కౌంట్లు ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. విక్రయ ప్రక్రియపై మర్చంట్‌ బ్యాంకర్లు అధ్యయనం చేయాలని ప్రభుత్వం కోరింది. కాగా, సంస్థ మూలధనం రూ.250 కోట్లుగా ఉంది. పెయిడ్ అప్ క్యాపిటల్ రూ .160 కోట్లు. ప్రస్తుతం రైల్వే శాఖ షేర్ క్యాపిటల్‌లో 87.40 శాతం వాటాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాంబే స్టాక్‌ ఎక్స్చెంజ్‌ (Bse) ఐఆర్‌సీటీసీ షేర్లు రూ .1,351.65 వద్ద ట్రేడవుతున్నాయి.

Advertisement

Next Story