- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పథకం’ ప్రకారం నిలిపివేత!
న్యూఢిల్లీ: భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం తప్పదన్న అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలు ఉండవని ప్రకటించింది. ఇప్పటికే కొత్త పథకాల ఆమోదం కోసం అనుమతులు కోరుతూ ఎలాంటి విన్నపాలు పంపకూడదని ఆయా శాఖలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అలాగే, ప్రస్తుత బడ్జెట్‌లో ఆమోదం పొందిన పథకాల అమలును మార్చి 31 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏదైనా మినహాయింపులు కావాలంటే వ్యయనిర్వహణశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపింది. ‘కొవిడ్-19 మహమ్మారి కట్టడి, బాధితులకు సాంత్వన చేకూర్చడం కోసం ఊహించని స్థాయిలో ప్రజాధనం వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తన ప్రాధాన్యాలను మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అందుకే, లాక్‌డౌన్ నేపథ్యంలో దెబ్బతిన్న రంగాలకు ఊతమివ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనకు మాత్రమే నిధులను ఖర్చు చేయాలని నిర్ణయించాం. ఈ రెండు పథకాలు మినహా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇతర పథకాలకు ప్రారంభించకూడదని నిర్ణయించినట్లు’ ఆర్థికశాఖ పేర్కొంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో భారత స్థూల దేశీయోత్పత్తి 11 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఆర్థిక పరిస్థితి నాలుగు దశాబ్దాల క్రితం నాటికి చేరుకుంది. భారత క్రెడిట్ రేటింగ్‌ను మూడిస్ తదితర సంస్థలు గణనీయంగా తగ్గించాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాల ప్రారంభం, అమలును నిలిపివేసినట్లు తెలుస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావంపైనే ఆర్థిక వ్యవస్థ పనితీరు ఆధారపడి ఉంటుందని, ఇందుకు అనుగుణంగానే విధానాలు ఉంటాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో ప్రకటించిన విషయం విధితమే.