- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగాల్ హింసపై కేంద్రం సీరియస్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోరుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన కేంద్ర హోంశాఖ.. తాజాగా నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించింది. అడిషినల్ సెక్రెటరీ స్థాయి అధికారి నేతృత్వం వహించే ఈ కమిటీ.. బెంగాల్‌లో హింస చోటుచేసుకున్న ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నది. అనంతరం దీనిపై హోంశాఖకు నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. మే 2న ఫలితాలు వెలువడి టీఎంసీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పలుచోట్ల అల్లర్లు చెలరేగిన విషయం విదితమే. బీజేపీ, సీపీఐ(ఎం) పార్టీల కార్యకర్తలే లక్ష్యంగా టీఎంసీ ఈ హింసకు పాల్పడుతుందని ఆయా పార్టీలు విమర్శలు చేస్తుండగా.. దీని వెనుక బీజేపీ శక్తులు ఉన్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.