మిషన్ భగీరథకు కేంద్రం రూ. 82.70 కోట్ల సాయం

by Shyam |
మిషన్ భగీరథకు కేంద్రం రూ. 82.70 కోట్ల సాయం
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో వేల కోట్ల రూపాయలు రాలేదుగానీ, కేంద్ర జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ మంచినీరు అందించడానికి మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా రూ. 82.70 కోట్లు అందింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతీ ఇంటికి తాగునీరు అందించడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్‌ను సమర్పించిన తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఈ డబ్బుల్ని మంజూరు చేసింది. మొత్తం సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ పథకం కింధ రాష్ట్రానికి రూ. 206.09 కోట్ల మేర అందనుంది. మిగిలిన మొత్తాన్ని విడతలవారీగా విడుదల చేయనుంది.

ఏ జిల్లాలో ఎన్ని గ్రామాల్లోని ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటిని అందిస్తామనేది.. యాక్షన్ ప్లాన్‌లో మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 54.37 లక్షల ఇండ్లకు త్రాగునీటి సరఫరా అవుతోందని పేర్కొని.. 35.86 లక్షల ఇండ్ల వివరాలను యాక్షన్ ప్లాన్‌తో పాటు పంపిన అనుబంధంలో వివరించారు.

మిషన్ భగీరథ ప్రాజెక్టు అంచనా వ్యయం మొత్తం రూ. 46,123 కోట్లు కాగా ఇప్పటికే రూ. 32,397 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని అవసరాలకే రూ. 28,952 కోట్లు ఖర్చు కానుందని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇండ్లకు నల్లాల కనెక్షన్ లాంటి అవసరాల కోసం రూ. 8,774 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఇంటికి జల్ జీవన్ మిషన్ ద్వారా త్రాగునీటిని అందించే ఫథకాన్ని అమలు చేయాల్సిందిగా.. అన్ని రాష్ట్రాలకూ ఆదేశించి నిధులను విడుదల చేస్తుండడంతో.. మిషన్ భగీరథ పథకానికి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుకునే వెసులుబాటు లభించింది

Advertisement

Next Story

Most Viewed