బహిరంగంగా ఉమ్మడం.. దేశవ్యాప్తంగా నిషేధం

by vinod kumar |
బహిరంగంగా ఉమ్మడం.. దేశవ్యాప్తంగా నిషేధం
X

ఢిల్లీ: స్వచ్ఛ భారత్ పథకం తీసుకురాలేని మార్పుల్ని కరోనా వైరస్ తీసుకొస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించగా, తాజాగా.. కేంద్ర ప్రభుత్వం సైతం ఇదే నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ పొడిగింపు అనంతరం కేంద్ర హోం మంత్రిత్వశాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించడమే కాకుండా ఉల్లంఘనకు పాల్పడితే కేసు నమోదు చేయడంతో పాటు జరిమానా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చెన్నై నగరపాలక సంస్థ ఓ అడుగు ముందుకేసి ఉమ్మి వేస్తూ పట్టుబడినట్లయితే అక్కడికక్కడే రూ.100 జరిమానా వసూలు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, ముఖానికి మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల అంటువ్యాధులు వ్యాపించే ముప్పు పొంచి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

tag: spit, ban, central government, coronavirus,

Advertisement

Next Story

Most Viewed